తెలంగాణ రైతాంగానికి మంత్రి కీలక మెసేజ్.. ఇక కేంద్రంపై యుద్ధమే!

by Satheesh |   ( Updated:2022-04-02 10:02:26.0  )
తెలంగాణ రైతాంగానికి మంత్రి కీలక మెసేజ్.. ఇక కేంద్రంపై యుద్ధమే!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దేశంలో గుడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోంది.. ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా తెలంగాణ రైతాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రైతు బంధు సభ్యులు, పలువురు రైతులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వరి ధాన్యం కొనాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12600 గ్రామ పంచాయతీలు, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌లో తీర్మానాలు చేసి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు రాయడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఎదిగింది అన్నారు. ఇక్కడే రైతాంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రైతాంగం సన్నద్ధం కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story