Nethanna Bima Scheme: రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకం

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-01 09:45:06.0  )
Minister KTR Announces Nethanna Bima Scheme for Weavers to Launch On August 7
X

దిశ, వెబ్‌డెస్క్: Minister KTR Announces Nethanna Bima Scheme for Weavers to Launch On August 7| దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో నేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7వ తేదీన నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రైతు బీమా మాదిరిగానే.. నేతన్నలకు బీమా అందిస్తామన్నారు. ఇందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. దురదృష్టవశాత్తూ నేత కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల బీమా పరిహారం అందించేలా ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ది చేకూరుతుందని వివరించారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతోనే రూపాయి చెల్లించకుండా లబ్దిదారులకు ఐదు లక్షల బీమా కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ పథకం అమలుకు చేనేత , జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని చెప్పారు.

60 ఏళ్ల లోపు వారు అర్హులు

నేతన్న బీమా పథకానికి 60 సంవత్సరాలలోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులు అర్హులు అని మంత్రి చెప్పారు. లబ్దిదారుల్లో ఎవరైనా మరణిస్తే పది రోజుల్లో బీమా సొమ్మును వారి కటుంబ సభ్యుల ఖాతాల్లో జమ అవుతుందని మంత్రి అన్నారు. ఈ స్కీమ్ అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. అర్హులైన చేనేత, పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులు అందరికి ఈ నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ స్కీమ్ కోసం రూ.50 కేటాయించామని ఇందులో ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. నేత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతన్నల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

చేనేత, జౌళి రంగానికి ప్రత్యేక గుర్తింపు

చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపునిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతం కంటే ప్రస్తుతం ఈ రంగానికి అధిక నిధుల కేటాయింపు చేస్తున్నామని వివరించారు. 2016-17 నుండి ప్రతి ఏడాది ప్రత్యేక బడ్జెట్ బీసీ వెల్ఫెర్ నిధుల నుంచి ఏటా రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామన్నారు. చేనేత మరియు జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్ కు ఇది అదనం అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్ క్రింద రూ.55.12 కోట్లను కేటాయించామని, బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ క్రింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో 400.00 కోట్లు కూడా కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం ఈ క్రింది కార్యక్రమాలను అములు చేస్తున్నామన్నారు.

ఇతర రాష్ట్రాల ప్రశంసలు

చేనేత అభివృద్ధి, సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రములో లేనివిధంగా చేనేత అభివృద్ధి, సంక్షేమము కొరకు తెలంగాణలో పథకాలు అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న స్కీమ్ లను ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు అధ్యయనం చేసి ప్రశంసిస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: కోటి జాతీయ జెండాలను ఎగురవేయనున్న Telangana ప్రభుత్వం

Advertisement

Next Story

Most Viewed