Minister Kakani: ప్రజాప్రతినిధులకు 'రుణ' వేధింపులు..! మంత్రి కాకాణికి బెదిరింపు కాల్స్

by Nagaya |   ( Updated:2022-07-30 09:00:48.0  )
Minister Kakani Receives Threat Calls From Loan Recovery Agents
X

దిశ, ఏపీ బ్యూరో : Minister Kakani Receives Threat Calls From Loan Recovery Agents| తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెదిరింపులు వచ్చి, 24 గంటలు గడవక ముందే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను వేధించారు.

అనిల్ కుమార్‌తో సంభాషణిలా..

పాతపాటి అశోక్ కుమార్ రూ.8లక్షలు అప్పు తీసుకున్నాడని అది చెల్లించాలని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రికవరీ ఏజెంట్ ప్రియాంక ఫోన్ చేసింది. తొలుత మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆమెతో చాలా హుందాగా మాట్లాడారు. అశోక్ కుమార్ మీ బ్రదర్ ఇన్‌లా అని చెప్పి రూ.8లక్షలు లోన్ తీసుకున్నారు. డబ్బు కట్టాల్సి ఉంది. దీనికి అనిల్ కుమార్.. అసలు అతడు ఎవరో తనకు తెలియదు. తనకు బావమరుదులు, బావ మరిది సోదరులు ఎవరూ లేరన్నారు. 'ఫ్లోట్రన్ బ్యాంకులో రూ.8లక్షలు లోన్‌ తీసుకున్నారు. ఆ డబ్బులు చెల్లించడం లేదు. మీరు చెల్లించాలని పేర్కొనడంతో అనిల్ కుమార్ యాదవ్ కోపడ్డారు. లోన్‌ తీసుకున్న వ్యక్తిని ఎత్తికెళ్లి లోపల వేయండి.. సదరు ఏజెంట్ 'డబ్బులు ఎవరు కడతారని నిలదీయగా' మంత్రి విరుచుకుపడ్డారు. అంతే కాదు రోజుకు29 సార్లు ఫోన్ చేస్తుండడంతో చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంత్రి కాకాణికీ వేధింపులు

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికీ పీఏకు లోన్‌యాప్ ఏజెంట్ల నుంచి కాల్స్ వచ్చాయి. లోన్ ఈఎంఐ చెల్లించాలని బెదిరించారు. ఈ నెల 25న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికీ కోల్‌మాన్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్‌ల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పర్సనల్ అసిస్టెంట్ శంకర్‌కు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఒక మహిళ కాల్ చేశారు. 'మీరు లోన్ తీసుకున్నారు. కట్టకపోతే మీ పిల్లలను చంపేస్తామని' బెదిరించారు. శంకర్ రూ. 25 వేలు చెల్లించినా మళ్లీ మళ్లీ కాల్స్ చేస్తుండడంతో జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నయ్ కు వెళ్లి కోల్‌మన్ కంపెనీలో సాంకేతిక ఆధారాలను సేకరించి.. మేనేజర్ మామిడిపూడి గురు ప్రసాద్, శివనాసన్ మహేంద్రన్, టీం లీడర్ మాధురి, నెల్లూరులోని ఫైనాన్స్ కంపెనీ రికవరీ మేనేజర్ పెంచలరావును అరెస్ట్ చేశారు.

అసలు పాతపాటి అశోక్ కుమార్ ఎవరు?

నెల్లూరు రామలింగాపురంలోని ఫుల్ ట్రాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పాతపాటి అశోక్ కుమార్ రూ.8.50 లక్షల లోన్ తీసుకున్నారు. రుణం తీర్చకపోవడంతో అశోక్ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి యాప్ నిర్వాహకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అందులో భాగంగా మంత్రికి గోవర్ధన్‌‌కు ఫోన్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేయండి.. లేదా నాకు చెప్పండి : మంత్రి కాకాణి

''లోన్ యాప్ ముఠాల ఆగడాలు ఎక్కువైతే పోలీసులకు కానీ తనకు కానీ చెప్పండి. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. ముత్తుకూరులో గడప గడపలో ఉండగా 79 కాల్స్ నా నంబర్‌కు చేశారు. సాధారణంగా నేనే ఫోన్ ఎత్తుతాను. కానీ గడప గడపకూలో ఉన్నా. నా వ్యక్తిగత సహయకుడు ఫోన్ తీశారు. పై నలుగురు నిందితులను పోలీసుల నలుగురిని అరెస్ట్ చేశారు. విడిపించేందుకు పది మంది ప్రముఖ లాయర్‌లు రావడం ఆశ్చర్యంగా ఉంది.''

ఇది కూడా చదవండి: రెచ్చిపోతున్న లోన్ యాప్ ఆగడాలు

Advertisement

Next Story