- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శనీలా దాపురించింది: మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, సూర్యాపేట : బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శనీలా దాపురించిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైందని, బీజేపీ పాలనలో దేశం తిరోగమనం చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్రంలో అనేక రకాల మోసాలకు, ద్రోహలకు పాల్పడుతుందన్నారు.
ఇవాళ పంజాబ్‌ను మించి అత్యధిక వరిని తెలంగాణ పండిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను బీజేపీ ప్రభుత్వం ముంచేసిందన్నారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి రేపటి నుండి నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టి రైతులను సంఘటితం చేసి, బీజేపీ దుష్ట పాలనను, వివక్షను ఎండగడతామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంపై పోరాటం చేస్తామని, వడ్లు కొనే దాకా కేంద్రాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు.