ఇవన్నీ చిల్లర చిల్లర ఫిర్యాదులు.. మంత్రి జగదీష్ రెడ్డి

by Vinod kumar |
ఇవన్నీ చిల్లర చిల్లర ఫిర్యాదులు.. మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట: నాగార్జున సాగర్ నీటిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డ్ కు ఫిర్యాదు చేయడం చిల్లర వ్యవహారంలా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్ నీటిని వినియోగించుకొని కేఆర్ఎంబీ కి ఫిర్యాదు చేయడం పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ నుంచి ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం లేదని, సాగర్ పైన మంచినీటి అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తున్నామన్నారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల త్రాగునీరు అవసరాల కోసం మాత్రమే సాగర్ నీటిని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.

హైయెస్ట్ డిమాండ్ ఉన్నప్పుడు గ్రిడ్ లో తేడా వస్తుందని అలాంటి సందర్భంలో అర్ధగంట మాత్రమే పవర్ జనరేట్ చేయాల్సి ఉంటుందన్నారు. అది ఎక్కడైనా చేయాల్సిందేనన్నారు. శ్రీశైలంలో విద్యుత్ జనరేషన్ తెలంగాణ నిలిపివేసిన కూడా ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేట్ చేసుకుందని అయిన చిల్లరగా ఏపి ప్రభుత్వం పై తెలంగాణ ఫిర్యాదు చేయలేదన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ప్రజల గొంతును ఎండబెట్టి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం గా నీటిని తరలించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్లుగా ఇబ్బంది పడ్డాం. హైదరాబాద్‌కు నీరు ఇవ్వాల్సిన సందర్భంలో కూడా సాగర్ గేట్లను ఎత్తి నీటిని తీసుకుపోయిన చరిత్ర ఏపీ ప్రభుత్వానిదని ఫైర్ అయ్యారు. వారి వైఫల్యం తప్పించుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story