- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అ౦బేద్కర్ భవన్ నిర్మల్‌కే తలమానికం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణంతో మూడున్నర దశాబ్ధాల కల నెరవేరిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్ భవన్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి గతంలో ఈ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశారని సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు సీయం కేసీఆర్ దశల వారీగా నిధులు మంజూరు చేశారన్నారు.
ఈ నెల 18న ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించనున్నామని వెల్లడించారు. 2 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా విశాలమైన ఆడిటోరియం, సమావేశ మందిరం, ఇతర ఆధునాతన వసతులతో దీన్ని తీర్చిదిద్దారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.