- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను బీజేపీ మోసం: మంత్రి హరీశ్ రావు
దిశ, అందోల్: సంగారెడ్డి జిల్లా సంగుపేటలో ఓ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధ్యక్షతన బుధవారం జరిగిన అందోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్‌ల వద్ద మోటర్‌లను బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని, విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వ రాయితీలు వర్తింపజేస్తామని మెలికలు పెడుతుందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో బోరు మోటర్‌లకు 40 వేల మీటర్లను ఎందుకు బిగించారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను నట్టెట ముంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే మా ధ్యేయమని చెప్పకుంటున్న కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని, వారు పాలించే రాష్ట్రాలలో మోటర్‌లకు మీటర్‌లను ఎందుకు బిగించారో చెప్పాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాజెక్టులు ఇచ్చి, తెలంగాణకు తీవ్ర ఆన్యాయం చేస్తుందన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి కోతలు విధిస్తే.. ఇదేంటని కేసీఆర్ ప్రశ్నిస్తే భాష సరిగ్గా లేదంటూ మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అతిగతి లేని పార్టీ అని, ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా నదిపై ఒక్క చెక్ డ్యాం కూడా కట్టలేదని, టీఆర్‌ఎస్ పాలనలో 14 చెక్ డ్యాంలను కట్టామన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ గెలవక పోతే ప్రజల్ని బుల్డోజర్ తో తొక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని, ప్రాజెక్టులను, చెక్ డ్యాంలను నిర్మించారని, ఉచిత కరెంట్, రూ.5 లక్షల బీమా సౌకర్యం, ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నా ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
బస్వవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోథల పథకం ద్వారా అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్ నియోజకర్గ ప్రాంతాలు సస్యశ్యామలవుతాయన్నారు. ఈ నెల 21న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అందోలు నియోజకవర్గం నుంచి 40 వేల మంది హజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా 30 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హూస్సెన్, తదితరులు ఉన్నారు.