Minister Errabelli: అల‌ర్ట్‌గా ఉండాలె.. క‌లెక్ట‌ర్ల‌కు మంత్రి ఆదేశాలు

by Javid Pasha |   ( Updated:2022-07-13 14:08:38.0  )
Minister Errabelli Dayakar Conducts Review On Rainfall
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : Minister Errabelli Dayakar Conducts Review On Rainfall| ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల పరిస్థితి పై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరా తీశారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, తదితర అధికారులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర వరదల పరిస్థితిని సమీక్షించారు. అమెరికా ఆటా మహాసభలకు హాజరై, తిరిగి వచ్చిన మంత్రి, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్త స‌మీక్ష‌లో భాగం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి ఫోన్‌లో సంభాషించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అలెర్ట్‌గా ఉండాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో కృషి చేసి ఏ చెరువు గాని, రోడ్డు గాని తెగిపోకుండా చూడాలని ఆయన కోరారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని సూచించారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని ఆయన కోరారు.

Also Read: తెలంగాణలో అధికారం ఆ పార్టీదే.. 'ఆరా' సర్వేలో సంచలన విషయాలు

Advertisement

Next Story