క్లైమేట్ చేంజ్ అంటే ఎలుకల జనాభా పెరగడమా?

by GSrikanth |
క్లైమేట్ చేంజ్ అంటే ఎలుకల జనాభా పెరగడమా?
X

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తేలికపాటి శీతాకాలాలు ఎలుకల్లో జనాభా పెరుగుదలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. యావరేజ్ వింటర్ టెంపరేచర్స్‌తో పాటు వేసవిలో ఎండలు మండిపోవడం.. ఎలుకల వృద్ధికి సానుకూలంగా మారుతున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా వేగంగా వేడిని కోల్పోయే ఎలుకలు.. జీవితాంతం వణుకుతూ బతికేస్తాయి. ఇక వింటర్‌లో చలి ప్రభావంతో చనిపోయే ఎలుకల సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఆ పరిస్థితి మారిందని చెబుతున్నారు పరిశోధకులు. క్లైమేట్ చేంజ్ కారణంగా శీతాకాలంలోనూ పెద్దగా చలి లేకపోవడంతో ఆహారం కోసం వెతికే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, చలికి తట్టుకుని జనాభాను విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇక ప్రపంచంలో ఎక్కువ మంది ఎలుక వల్లనే చనిపోయారని(ప్లేగు లాంటి వ్యాధులతో) చరిత్ర చెబుతుండగా.. ఇప్పుడు వీటి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు దారితీస్తోంది. ఈ విషయంలో జనాన్ని హెచ్చరిస్తున్న పరిశోధకులు.. ఎలుకలు లైమ్ వ్యాధి బ్యాక్టీరియాకు నేచురల్ రిజర్వాయర్స్ అని పేర్కొన్నారు. తద్వారా జ్వరం, అలసట, కీళ్ల నొప్పులు, స్కిన్ రాషెస్ తలెత్తడంతో పాటు జాయింట్స్, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపగలవని వెల్లడిస్తున్నారు. మరో మహమ్మారిగా మారకముందే వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story