- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగా హీరోయిన్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ అమ్మడు గాడ్సే(Godsey), అమ్ము వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సరసన ‘SD18’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలై సినిమాపై హైప్ పెంచింది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి పెళ్లి(marriage) విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘‘జీవితంలో నేను పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశాను. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నట్లు అనిపించింది. పెళ్లి వల్ల చాలా మంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యాను. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలని అనుకున్నా.
కానీ పెద్దయ్యాక పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. కొన్నేళ్ల ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాను. ఓ మాట్రిమోని(Matrimony) సైట్లో నేను నా ప్రొఫైల్ కూడా పెట్టాను. కానీ అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. అయితే కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.