Matru Garbhasana Yoga: మాతృ గర్భాసనం వల్ల ప్రయోజనాలేంటి?

by Manoj |   ( Updated:2022-06-21 06:54:59.0  )
Matru Garbhasana Yoga benefits
X

దిశ, ఫీచర్స్: Matru Garbhasana Yoga benefits| ఈ ఆసనంలో అనేక భంగిమలుంటాయి. కాబట్టి ఒకేసారి అన్నీ చేయాల్సిన అవసరం లేకుండా రోజుకొక యాంగిల్ ట్రై చేయొచ్చు. ఈ రోజు మొదటిది చేద్దాం. బల్లపరుపు నేలమీద మ్యాట్‌పై పడుకోవాలి. బాడీని రిలాక్స్ చేసి రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి రెండు పాదాలు కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను శరీరానికి ఇరువైపులా నేలపై ఆన్చాలి. బాడీని ఎటూ కదల్చకుండా నిటారుగా ఉంచి రెండు కాళ్ల బొటన వేలు, పాదం దగ్గరగా అదిమిపెట్టి ఉంచాలి. ఈ ఆసనంలో పాదాలు విడిపోకుండా రెండు మోకాళ్లను పైకి, కిందకు లేపవచ్చు లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉండి బలంగా శ్వాస పీల్చుతూ వదలాలి.

ప్రయోజనాలు:

* గర్భిణులకు ఉపయోగకరమైనది.

* మహిళల రుతుక్రమానికి మేలు చేస్తుంది.

* కండరాల వ్యాధులున్న వారికి ప్రయోజనం.

* ఒత్తిడి తగ్గించి విశ్రాంతినిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed