- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"మహేష్ బాబు"ని వెంటాడుతున్న "మార్వెల్ సినిమాలు"
దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు. అందులో ముఖ్యంగా ఓవర్ సిస్‌లో బిగ్ మార్కెట్ అయిన యూఎస్ఏలో భారీ సంఖ్యలో మహేష్ అభిమానులు ఉంటారు. గత 10 సంవత్సరాలుగా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలు అన్నీ కూడా USA బాక్సాఫీస్ వద్ద మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. అయితే గత కొంత కాలంగా మహేష్ బాబు చిత్రాలను హాలీవుడ్ సినిమాల నిర్మాణ సంస్థ అయినా మార్వేల్( MARVEL) వెంటాడుతుంది. 2018 లో, మహేష్ బాబు భరత్ అనే నేను, అలాగే మార్వెల్ స్టూడియోస్ 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ దాదాపు ఒకే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా, USA బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూలు చేయడంలో మహేష్ సినిమా విఫలమైంది.
ఆ తర్వాత 2019లో "మహర్షి" రిలీజ్ సమయంలో కూడా "అవెంజర్స్: ది ఎండ్ గేమ్" విడుదలైంది. మహర్షి USA లో బాగానే వసూళ్లు రాబట్టినప్పటికీ ఎక్కవు థియేటర్స్ లేక అధిక వసూళ్ల అవకాశాలను అవెంజర్స్: ది ఎండ్ గేమ్ దెబ్బతీసింది. అయితే, ఇప్పుడు కూడా మహేష్ బాబు రాబోయే చిత్రం ''సర్కారు వారి పాట'' మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మహేష్ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు అనగా మే 6న మార్వెల్ నుంచి ''డాక్టర్ స్ట్రేంజ్: మ్యాడ్‌నెస్ ఆఫ్ ది మల్టీవర్స్'' రిలీజ్ కానుంది. హాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో డాక్టర్ స్ట్రేంజ్ ఒకటి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందన వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఇంత పెద్ద ముప్పును సర్కార్ వారి పాట ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.