ఏసీబీకి చిక్కిన మరికల్ మండల అవినీతి అధికారులు

by Manoj |   ( Updated:2022-04-08 10:40:04.0  )
ఏసీబీకి చిక్కిన మరికల్ మండల అవినీతి అధికారులు
X

దిశ, మరికల్: మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన మహిళా రైతు సంధ్యారాణి తండ్రి పేరు మీద వున్న భూమి వివరాలు ఆన్లైన్లో తప్పుగా నమోదయ్యాయి. దీంతో ఆమె వాటిని సరిచేయాలని 9 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సరిచేయలేదు. వివరాల్లోకి వెళితే.. సీనియర్ అసిస్టెంట్ తాహెర్ మ్మల్లిని సంప్రదించి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. మేము డబ్బులు ఇవ్వలేమని సదరు మహిళ రైతు చెప్పగా, తాహెర్ 4 లక్షలు డిమాండ్ చేసి 3 లక్షల 50 వేలకు సెటిల్ చేసుకున్నాడని మహిళ రైతు వాపోయారు.

ఈ విషయాయమై రైతు సంధ్యారాణి హైదరాబాదులోని ఏసీబీ అధికారులను సంప్రదించింది. పథకం ప్రకారం నిన్న సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలోని వన్ టౌన్ లో రైతు నుండి సీనియర్ అసిస్టెంట్ తాహెర్, ఇన్చార్జి తహసీల్దార్ జగన్ డబ్బులు తీసుకుంటుండగా 15 మంది ఏసీబీ బృందం వలపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితులను మరికల్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, వారిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.

Advertisement

Next Story