కూతురితో పాటు చిన్న స్కర్ట్ వేసుకొని ఆ పని చేస్తున్న మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న వీడియో(పోస్ట్)

by Kavitha |
కూతురితో పాటు చిన్న స్కర్ట్ వేసుకొని ఆ పని చేస్తున్న మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న వీడియో(పోస్ట్)
X

దిశ, సినిమా: నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ, అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌లో చాన్స్‌ల కోసం తెగ ఆరాట పడుతోంది. మరి చూడాలి అక్కడ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో. అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. నిత్యం నెట్టింట ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ, ట్రోల్స్‌కి గురౌతూ ఉంటుంది. అంతే కాకుండా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అలాగే తన కూతురు ఆపిల్‌కి సంబందించిన ఫొటోలు వీడియోలు సైతం పెడుతుంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో బుల్లి స్కర్ట్ వేసుకుని తన కూతురు ఆపిల్‌తో కలిసి డాన్స్ చేస్తుంది. ప్రస్తుతం తన గారాల పట్టితో కలిసి చిందేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు.. సూపర్, వావ్, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story