ఇది బతుకమ్మ కాదు మంచు లక్ష్మి.. చూసుకోవాలి కదా?

by samatah |   ( Updated:2022-08-30 13:34:05.0  )
ఇది బతుకమ్మ కాదు మంచు లక్ష్మి.. చూసుకోవాలి కదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్, సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఆమె పెట్టే పోస్టులు కొన్ని వివాదాలకు తావిస్తుంటాయి. తాజాగా అలాంటి పోస్టే ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో బోనాల పండుగ జరుగుతున్న నేపథ్యంలో బతుకమ్మను నెత్తిన ఎత్తుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అక్కా.. ఇది బతుకమ్మ పండుగ కాదు, బోనాల పండుగ.. జర చూసుకో అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ దీనిపై మన లక్ష్మి అక్క ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story