- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైసెన్స్ లేని పిస్టల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..
దిశ, మియాపూర్: అక్రమంగా పిస్టల్‌ను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక ఆటో, మూడు బుల్లెట్లు, 2 ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏసీపీ క్రిష్ణప్రసాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గౌతం కుమార్ ఠాకూర్(24) తండ్రి దినేష్ ఠాకూర్ బీహార్ రాష్ట్రం. ఆటో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. అమీన్ పూర్‌లో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అక్రమ మార్గంలో లైసెన్స్ లేని దేశీ పిస్టల్ 7.5 లైసెన్స్ లేకుండా బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ, మియాపూర్ పోలీసులు బొల్లారం రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ముందుగానే పసిగట్టి యూటర్న్ వద్ద తప్పించుకునే ప్రయత్నం చేయగా వలపన్ని పట్టుకున్నారు. అతను నుండి ఆటో టీఎస్15 యూసీ 6419, 3 బుల్లెట్లు, 2 ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌వోటీ, మియాపూర్ పోలీస్‌లను ఏసీపీ అభినందించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.