- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సతీ సావిత్రి లేదంటే క్యారెక్టర్‌లెస్ ఉమన్ : బోల్డ్ కామెంట్స్
దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ కామెడీ డ్రామా 'RK/RKay'తో రీఎంట్రీకి రెడీ అవుతోంది. బోల్డెస్ట్ అండ్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్‌తో దాదాపు 20 ఏళ్లు ఇండస్ట్రీని ఏలిన భామ.. రెండు దశాబ్దాల క్రితం మహిళల పాత్రలు సతీ సావిత్రి టైప్ లేదంటే క్యారెక్టర్‌లెస్ ఉమన్‌గా ఉండేవని తెలిపింది. కానీ ప్రస్తుతం మహిళలను కూడా మనుషుల్లాగా చూస్తున్నారని, అలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇక తను నటించిన 'మర్డర్' సినిమాను 'గెహ్రాయియా'తో పోల్చిన బ్యూటీ.. ఇందులో దీపికా పదుకొణె చేసిన పాత్రను తాను 15ఏళ్ల క్రితమే చేశానని వివరించింది. కానీ అప్పుడు పెద్ద డ్రామా క్రియేట్ చేశారని, ముద్దు-బికినీ గురించే మాట్లాడుకున్నారు తప్ప దాని వెనుకున్న ఆంతర్యమేంటనేది గుర్తించలేదని చెప్పింది. అప్పటి జనం పూర్తిగా సంకుచిత మనస్తత్వంతో ఉండేవారని, ఇప్పుడు పరిస్థితులు మారడం శుభపరిణామమని చెప్పింది.