Lucky Baskhar : వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘ల‌క్కీ భాస్క‌ర్‌’

by Prasanna |   ( Updated:2024-11-14 08:20:38.0  )
Lucky Baskhar : వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘ల‌క్కీ భాస్క‌ర్‌’
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్క‌ర్ స‌ల్మాన్ ( Dulquer Salmaan ) హీరోగా ల‌క్కీ భాస్క‌ర్ ( Lucky Baskhar ) మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. దీపావ‌ళి కానుక‌గా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బస్టర్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళ్తుంది.

వంద కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా దీని హురిచి వెల్ల‌డించింది. అలాగే, ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేసింది.రిలీజ్ అయిన 14 రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1.009 బిలియ‌న్ రూపాయ‌లు సాధించిన‌ట్లు వెల్లడించింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో మీనాక్షి చౌద‌రి కథానాయికగా న‌టించింది.

స‌చిన్ ఖేడేక‌ర్, సాయికుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు.

Advertisement

Next Story