Lucky Baskhar : వంద కోట్ల‌కు చేరువ‌గా ల‌క్కీ భాస్క‌ర్ మూవీ క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |   ( Updated:2024-11-10 12:06:56.0  )
Lucky Baskhar : వంద కోట్ల‌కు చేరువ‌గా ల‌క్కీ భాస్క‌ర్ మూవీ క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దీపావళి రోజున థియేటర్లో విడుదలైంది. సినిమా మీద నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు షో లు వేశారు. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

రెండు వారాలవుతున్నా ఇప్పటికీ క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా ఉన్నాయి. పది రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 88.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీపావ‌ళి మెగా బ్లాక్ బాస్ట‌ర్ అంటూ ఓ ఫోటోను రిలీజ్ చేసింది.

Advertisement

Next Story