- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాసంగ్రామ యాత్రతో దేశవ్యాప్త చర్చకు తెరలేపుదాం
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా సంగ్రామ యాత్రతో చరిత్ర సృష్టిద్దామని బీజేపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. బర్కత్ఫురలోని హదరాబాద్సెంట్రల్జిల్లా కార్యాలయంలో రెండో విడుత పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర చేపట్టడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ నాయకత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలను స్వయంగా తెలుసుకుని జనం ఎలాంటి పాలన కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించడమే తన యాత్ర ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే తన అంతిమ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతిని నిర్వహించిన అనంతరం సాయంత్రం గద్వాల జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర మొదలుపెడుతున్నట్లు చెప్పారు. జాతీయ నాయకత్వం, కార్యకర్తల అండతో తొలి విడుత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందన్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, పాదయాత్ర సహ ప్రముఖ్ లు వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, బొమ్మ జయశ్రీ, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, నాగూరావు నామోజీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాశ్, సంగప్ప, రాణి రుద్రమదేవి, పోరెడ్డి కిశోర్, చందుపట్ల కీర్తిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, గుండగోని భరత్ తదితరులు పాల్గొన్నారు.