Trisha: అమితంగా ప్రేమిస్తున్నా.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన త్రిష!

by Hamsa |   ( Updated:2024-10-28 10:17:30.0  )
Trisha: అమితంగా ప్రేమిస్తున్నా.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన త్రిష!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘వర్షం’ (varsham)చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించడంతో పాటు వరుస ఆఫర్లు అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది.

అంతేకాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. 41 ఏళ్లు వచ్చినప్పటికీ త్రిష(Trisha) పెళ్లి చేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. అయితే గత ఏడాది ‘లియో’(Leo) మూవీతో బ్లాక్ బస్టర్ విషయం సాధించిన త్రిష గుడ్ బ్యాడ్ అగ్లీ, విశ్వంభర(Viswambhara), విదాముయార్చీ, వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, త్రిష(Trisha) ఓ ట్వీట్ చేసి అందరికీ షాకిచ్చింది. ‘‘మనుషులను దూరంగా పెడతాను. శునకాలను అమితంగా ప్రేమిస్తుంటాను. కానీ నా పెట్స్ మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయి. కాబట్టి మనమంతా కలిసి ప్రేమ సమాజాన్ని స్థాపిద్దాం’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఇక అది చూసిన వారంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా త్రిష(Trisha) ప్రేమలో పడింది అందుకే హింట్ ఇస్తూ ఈ పోస్ట్ పెట్టిందని పలు కామెంట్లు చేస్తూ పోస్ట్‌ను వైరల్ చేశారు. దీంతో ఆమె ఈ పోస్ట్‌ను తొలిగించినట్లు తెలుస్తోంది.

Read More..

Nayanthara: ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇస్తూ నయనతార ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed