బావిలో లెక్చరర్ మృతదేహం.. అసలు కారణం అదేనా..?

by Javid Pasha |   ( Updated:2022-03-29 10:17:24.0  )
బావిలో లెక్చరర్ మృతదేహం.. అసలు కారణం అదేనా..?
X

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి పట్టణంలోని ఆచార్య డిగ్రీ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. నర్సంపేట నుండి ఖానాపూర్ వెళ్లే వైపుగా ఉన్న బావిలో మంగళవారం రంజిత్ మృతదేహం కనిపించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం మృతదేహాన్ని బయటకి తీశారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే రంజిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకు రంజిత్ మరణానికి అసలు కారణం తెలియదు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రంజిత్‌ది హత్య, ఆత్మహత్య అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రంజిత్‌కు ఎవరితోనైనా విరోధం ఉందా, ఇటీవల కుంటుంబకలహాలు ఏమైనా జరిగాయా సహా పలు కొణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story