నిర్మల గౌతమ్ ఆశ్రమంలో ప్రాణహిత పుష్కర మహాయాగం.. 12 రోజులు చేసే యాగాలు ఇవే..

by Javid Pasha |
నిర్మల గౌతమ్ ఆశ్రమంలో ప్రాణహిత పుష్కర మహాయాగం.. 12 రోజులు చేసే యాగాలు ఇవే..
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో నిర్మల గౌతమ ఆశ్రమంలో ప్రాణహిత పుష్కరాలను పురస్కరించుకుని పుష్కర మహా యాగము నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నిర్మల వీరేశ్వర శాస్త్రి తెలిపారు. పుష్కరాల సందర్భంగా ఈశ్వర క్షేత్రంలో అష్టోత్తర శత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నిర్మించి 25 ఏళ్లు పురస్కరించుకొని రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్రిలింగ క్షేత్రాలలో ఒకటి కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం వెలసిన ఈ గ్రామ సమీపంలో ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ప్రాణహిత నది పుష్కరాలు 13 వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్నాయి. దేవతల గురువు బృహస్పతి మీనరాశిలో ప్రవహిస్తుండడంతో ఈ ఏడాది ప్రాణహిత నది పుష్కరాలు వచ్చాయి. నిర్మల గౌతమ్ ఆశ్రమంలో పుష్కర మహాయాగం సందర్భంగా అక్షర కోటి శివ పంచాక్షరి కోటి గౌరీ పంచాక్షరి గౌరీ పూజ మహోత్సవం పూర్వక పుష్కర మహా యాగము సహస్ర బ్రాహ్మణ అన్నదాన ప్రతిరోజు పుష్కర కాలము నందు అసంఖ్యాక అన్నదాన మహా యాగము నిర్వహించు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివ రాజ్య నిర్మాత నీలకంఠశాస్త్రి రాజేశ్వరీ తెలిపారు.

13 వ తేదీ శ్రీ లక్ష్మీ గణపతి హవనము, రుద్ర హోమం, 14 వ తేదీ నవగ్రహ హోమం బృహస్పతి, పాశుపత హోమం,15 వ తేదీ శ్రీ లక్ష్మి కుబేర మహా యాగం, చండీ హోమం,16 వ తేదీ మహా సరస్వతీ యాగముం, దుర్గా సూక్త హోమం, 17 వ తేదీ ఆయుష్య హోమం, శివ పంచాక్షరీ హోమం, 18 వ తేదీ పుత్ర కామేష్టి హోమం, మహా రుద్రయాగం,19 వ తేదీ శివగీత మహా యాగం, మన్యుసూక్త హవనము, 20 వ తేదీ సుదర్శన యాగం, విష్ణు సహస్ర నామ యాగము, 21 వ తేదీ నక్షత్ర యాగం, బృహస్పతి పాశుపత హోమం,22 వ తేదీ మహా సౌర యాగం, అష్టలక్ష్మీ యాగం,23 వ తేదీ మహా మృత్యుంజయ హోమం,నవగ్రహ హోమం,24 వ తేదీ రుద్ర హోమం నక్షత్ర మహా యాగములు ఇలా ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed