- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరికొత్త మైలురాయిని చేరుకున్న లంబొర్ఘిని!
ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ లంబొర్ఘిని భారత మార్కెట్లో మొదటిసారిగా 400 యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించినట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో తొలిసారిగా 2007లో స్థానిక కార్యకలాపాలను ప్రారంభించింది. గత పదిహేనేళ్ల కాలంలో వినియోగదారుల నుంచి గణనీయమైన స్పందన రావడంతో కీలక మైలురాయిని సాధించగలిగామని లంబొర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో లంబొర్ఘిని బ్రాండ్ ద్వారా వినియోగదారులకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. కాగా, దేశీయ ఆటో పరిశ్రమలో లంబొర్ఘిని బ్రాండ్ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉందని ఇటీవలే కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లో అత్యంత సంపన్న వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధించగలమని, అలాగే, ఇటీవల పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు ప్రాధాన్యత నేపథ్యంలో కంపెనీ హైబ్రిడ్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.