హీరో ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ ఫైర్.. 3 సెకన్లకు రూ.10 కోట్లు కట్టాలా అంటూ.. దుమారం రేపుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-11-16 14:29:46.0  )
హీరో ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ ఫైర్.. 3 సెకన్లకు రూ.10 కోట్లు కట్టాలా అంటూ.. దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ గత ఏడాది ‘జవాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక అదే ఫాంతో ప్రస్తుతం ఓ ఐదు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇందులో రెండు సీక్వెల్ చిత్రాలు కావడం విశేషం. ఇక నయన్ లైఫ్ స్టోరీతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రాబోతుంది. ఈ సినిమా ‘బియాండ్ ది ఫెయిర్ టేల్’ అనే పేరుతో వస్తున్నట్లు ఇటీవల నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించినది. అయితే ఇందులో నయనతార వ్యక్తిగత విషయాలు, సినీ జీవితంలో వాస్తవాలను చూపించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా నయన్.. హీరో ధనుష్ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు. “ మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయిన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం. మీరు ఆ సినిమాతో పాటు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది.

నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఈ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్‌వోసీ(NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా..? ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలోనే మీ ఆమోదం కోసం ఎదురు చూశాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడంతో రీ ఎడిట్ చేశాం. ఆ పాటలు వాడుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది” అంటూ నయన్ బహిరంగ లేఖలో రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట దుమారం రేపుతోంది.

Read More...

‘ఈ ఐదారు రోజులు నాకు క్రాష్ కోర్సులా అనిపించింది’.. స్టార్ హీరో‌పై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (పోస్ట్)



Advertisement

Next Story