పెట్రోల్ కన్నా బీర్ చీప్ అంటూ అమ్మాయి నిరసన.. పిక్ వైరల్

by Javid Pasha |
పెట్రోల్ కన్నా బీర్ చీప్ అంటూ అమ్మాయి నిరసన.. పిక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ రేట్లతో సామన్యుడు పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రజలు ధరల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. దీనికి తోడుగా నిత్యావసర ధరలు పెరగడం సామాన్యుడిపై పెనుభారం పడినట్లైంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.120 వరకు ఉంది. అటు విపక్షాలు విమర్శించినా ఏమి లాభం లేదు. ఇదిలా కొనసాగితే మళ్లీ సైకిల్ తోక్కడం మొదలు పెట్టాల్సిందే అంటూ వస్తున్న మీమ్స్, ట్రోల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయి వినూత్నంగా నిరసన చేపట్టింది. 'ఇప్పుడు పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్ బండ్లు నడపకండి.. అందరూ మద్యం తాగండి' అంటూ ఆ అమ్మాయి పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు నిజమేనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే 'బండ్లు కూడా మనలా మందు కొడితే బాగుండు' అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed