- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి? మంత్రి కేటీఆర్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రధాని మోడీపై, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించే మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కామెంట్లు చేశారు. 'దేశంలో ద్రవ్యోల్బణాన్ని లేదా దేశంలోకి చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని మీరు ఏమని పిలుస్తారు? అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఎ) 56" బి) విశ్వగురు సి) అచ్ఛే దిన్ వాలే డి) పైవన్నీ అన్‌పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి' అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేక పోతున్నారని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ బార్డర్‌లో చైనా మరో గ్రామాన్ని నిర్మించిందని. శాటిలైట్ ఫొటోలతో మీడియాలో వచ్చిన వార్తలను షేర్ చేశారు.
కేటీఆర్ గారు జాగ్రఫీలో వీక్ అనుకుంటా?
కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ..'కేటీఆర్ గారు మీరు జాగ్రఫీలో కొంచం వీక్ అనుకుంటా. డోక్లాం ప్రాంతం భూటాన్‌లో ఉంది. భారతదేశంలో కాదు. పెట్రోలింగ్, సరిహద్దు భద్రతలో భూటాన్ రాయల్ ఆర్మీకి భారత సైన్యం సహాయం చేస్తుంది అనేది వేరే విషయం. దయచేసి అట్లాస్ చూడండి. అప్పుడు, అరుణాచల్ సరిహద్దులో నిర్మిస్తున్న గ్రామం చైనా లోపల ఉంది అని అర్థం అవుతుంది'అని కామెంట్ చేశారు. కాగా, 2017లో డోక్లామ్ పీఠభూమిలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ పొరుగు దేశాల మధ్య యుద్ధ భయాలను కూడా రేకెత్తించింది. భూటాన్ ఆ ప్రాంతం తమకు చెందినదని వాదించడంతో, భూటాన్ వాదనకు భారత్ మద్దతు తెలిపింది.