వేములవాడ ఆసుపత్రి సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తిన కేటీఆర్

by S Gopi |
వేములవాడ ఆసుపత్రి సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తిన కేటీఆర్
X

దిశ, వేములవాడ: వేములవాడ ఏరియా దవాఖానలో ఈ నెల 24న ఒకేరోజు జరిగిన రెండు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను ఏరియా ఆసుపత్రి డాక్టర్ మహేష్ నేతృత్వంలో విజయవంతంగా పూర్తి చేయడంతో జిల్లా మంత్రి కె. తారక రామారావు గురువారం ట్విట్టర్ వేదికగా వేములవాడ ఏరియా ఆసుపత్రి టీమ్ కు అభినందనలు తెలుపుతూ, వెల్ డన్ డా. మహేష్ అంటూ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మహేష్ ను మంత్రి ప్రత్యేకంగా ప్రశంశించారు.

కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన పిట్టల మల్లవ్వ వయసు(68) వట్టిమల్ల గ్రామానికి చెందిన భూక్య శీల (64) మోకాలకు సంబంధించిన జబ్బుతో బాధ బాధపడుతూ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం రావడంతో సదరు రోగిని పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి మోకాలు కీలు మార్పిడి చికిత్స అవసరమని గుర్తించి ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో ఆ చికిత్సను పూర్తిగా ప్రభుత్వం సహకారంతో ఉచితంగా నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ శస్త్ర చికిత్సలో వైద్య బృందం డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ శశి డాక్టర్ తిరుపతి పాల్గొని విజయవంతం చేశారు. దీనిపై స్పందించిన జిల్లా మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా ఏరియా ఆసుపత్రి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed