ప్రభాస్ విచిత్రమైన మనస్తత్వం కలవాడు.. కృతి సనన్

by sudharani |
ప్రభాస్ విచిత్రమైన మనస్తత్వం కలవాడు.. కృతి సనన్
X

దిశ, సినిమా: స్టార్ నటి కృతి సనన్ సహ నటుడు ప్రభాస్‌తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందంటోది. 'ఆది పురుష్'లో సీతమ్మగా కనిపించబోతున్న బ్యూటీ.. ఓ మీడియా సమావేశంలో డార్లింగ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. షూటింగ్‌ టైమ్‌లో అతనిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు గుర్తించినట్లు చెప్పింది. అయితే అందరూ అనుకున్నట్లు అది ఫుడ్ స్టోరీ కాదన్న నటి.. మనసులో కొన్ని విచిత్రమైన భావాలను కలిగి ఉన్నా బయటకు మరోలా కనిపిస్తాడని తెలిపింది. అంతేకాదు కెమెరా దగ్గరగా ఉన్నప్పుడు అతను కళ్లతో చేసే మ్యాజిక్ దగ్గరి నుంచి చూసి గొప్ప అనుభూతి చెందినట్లు వెల్లడించిన కృతి.. ప్రభాస్ మంచి హృదయంగలవాడని, తమ మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు చెప్పుకొచ్చింది. చివరగా అలాంటి వ్యక్తితో మళ్లీ పని చేయడానికి ఇష్టపడతానన్న ఆమె మరో సినిమా చాన్స్ వస్తే ఆనందంగా స్వీకరిస్తానని మనసులో మాట బయటపెట్టింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆది పురుష్' 2023 జనవరి 12 థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Next Story