- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవర్ లేక పనులకు బ్రేక్.. పట్టించుకోని విద్యుత్‌శాఖ
దిశ, తెలంగాణ బ్యూరో: కోఠి ఆరోగ్యశాఖ క్యాంపస్‌లోని డీఎంఈ బిల్డింగ్‌లో బుధవారం పవర్ లేక పనులన్నింటికీ బ్రేక్ పడింది. స్థానికంగా ఉండే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ లేదని స్టాఫ్ చెప్పారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సదరు ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినప్పటికీ, విద్యుత్ శాఖ ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. దీంతో ఫ్యామిలీ వెల్ఫేర్, డీఎంఈ, టీవీవీపీ హెచ్ఓడీ ఎవ్వరూ కార్యాలయాలకు రాలేదని సమాచారం. దీంతో పాటు కొందరు స్టాఫ్ కూడా వచ్చి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా ఇప్పటి వరకు మరమ్మత్తులు చేయలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భవనంలో కరెంట్ లేకవోపడంతో వివిధ పనుల నిమిత్తం డీఎంఈ కార్యాలయానికి వచ్చే మెడికల్‌స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాల నుంచి కూడా చాలా మంది డాక్టర్లు వచ్చి తిప్పలు ఎదుర్కొన్నారు.