ఏపీలో హాట్ టాపిక్‌గా కొడాలి నాని.. ఆ పదవితో సంతృప్తి చెందుతాడా..?

by Satheesh |
Gudivada MLA Kodali Nani Criticises Chandrababu Naidu Over YCP MPs Resignation
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్ విస్తరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 25మందితో నూతన మంత్రి మండలి ఏర్పాటయ్యింది. 15 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వగా.. 10మంది మంత్రులు తిరిగి క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారిని పార్టీ హైకమాండ్ బుజ్జగించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ కీలక నేత, తాజా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరిగి క్యాబినెట్‌లో చోటుదక్కకపోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి నుంచి మంత్రి వర్గ విస్తరణ జరిగిన.. కొడాలి నానికి మాత్రం మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.

అయితే, అనుహ్యంగా 25మంది మంత్రుల కొత్త జాబితాలో కొడాలి నాని పేరు లేకపోవడంతో ఆయన అభిమానులతో పాటు, వైసీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన కొడాలి నాని.. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో కొడాలి నాని ఒకరు. వైసీసీ ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న నాని.. టీడీపీని, ఆ పార్టీ నేతలను ధీటుగా ఎదుర్కొంటూ రాష్ట్రంలో అగ్రనేతగా ఎదిగారు. కొడాలికి మంత్రి పదవి దక్కకపోవడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే మంత్రి పదవి దక్కని నాని అభిమానులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం త్వరలో ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్‌గా కొడాలి నానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి క్యాబినెట్ హోదా కల్పించనున్నట్లు సమాచారం. కొడాలికి మంత్రి పదవి దక్కలేదని నిరాశలో ఉన్న ఆయన అభిమానులకు ఈ వార్త కాస్త ఉపశమనం కల్పించనుంది.

Advertisement

Next Story