- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేకేఆర్‌కు అవకాశాలు ఎక్కువ?: మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఐపీఎల్ సీజన్ -15 టైటిల్ కొట్టే సత్తా అయ్యర్ సేనకు ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్, ప్రస్తుత లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ తర్వాత అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని పేర్కొన్నారు.
గతంలో ఢిల్లీకి నాయకత్వం వహించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు సారధిగా కొనసాగుతుండగా.. అయ్యర్ నాయకత్వ లక్షణాలు బాగున్నాయని పఠాన్ వెల్లడించాడు. గంభీర్ తర్వాత అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ టైటిల్ కొల్లగొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 2012, 2014 సీజన్లలో గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. తాజాగా అయ్యర్ కెప్టెన్సీలో మూడు మ్యాచులు ఆడిన నైట్ రైడర్స్ జట్టు రెండింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది.