Kiran Abbavaram: మలయాళంలోకి కిరణ్ అబ్బవరం ‘క’.. రిలీజ్ ఎప్పుడంటే?

by sudharani |
Kiran Abbavaram: మలయాళంలోకి కిరణ్ అబ్బవరం  ‘క’.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లెటెస్ట్ మూవీ ‘క’ (Kaa) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విలేజ్ (village) బ్యాక్‌డ్రాప్ (backdrop)లో డైరెక్టర్స్ సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి (Diwali) స్పెషల్‌గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. ఇప్పటికీ కలెక్షన్స్‌లో దూసుకుపోతూ.. దీపావళి విన్నర్‌గా నిలిచింది. అలాంటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మలయాళం రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు నవంబర్ 22 నుంచి మలయాళం (Malayalam)లో రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చారు చిత్ర బృందం. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ (viral) కావడంతో.. మిగిలిన భాషల్లో హిట్ అందుకున్నట్లే మలయాళంలో కూడా పెద్ద్ సక్సెస్ కావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. ఈ మూవీలో తన్వీరామ్ (Tanveeram), నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్స్‌గా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

Advertisement

Next Story