- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM KCR: యశ్వంత్ సిన్హా గెలిస్తే దేశం గౌరవం పెరుగుతుంది
దిశ, వెబ్‌డెస్క్: KCR says, India respect will increase if Yashwant Sinha win| విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా జలవిహార్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాపై ప్రశంసల వర్షం కురిపించారు. మంచి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. లాయర్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నేతగా యశ్వంత్ సిన్హా ప్రస్థానం అభినందనీయమన్నారు. అంతటి సీనియర్ లీడర్‌కు స్వాగతం పలకడం తమకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం ఆత్మ, అంతరాత్మ మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. గతంలో ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హా గెలిస్తే.. దేశం గౌరవం రెట్టింపవుతుందని అన్నారు.