Katrina Kaif: బీచ్‌లో ఆ పని చేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఫ్యాన్స్ మళ్లీ ఫిదా

by Mahesh |   ( Updated:2022-04-07 14:12:26.0  )
Katrina Kaif: బీచ్‌లో ఆ పని చేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఫ్యాన్స్ మళ్లీ ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె అందాలకు సోషల్ మీడియా దాసోహం అంటోంది. ఆమె ఫోటో వచ్చిందంటే చాలు కొన్ని క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమె బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. అమ్మడి అందానికి యావత్ భారత్ ఫిదా అయిపోయింది. అయితే కత్రినా పోయిన డిసెంబర్‌లో తన ప్రియుడు విక్కి కౌశల్‌ను వివాహం చేసుకుంది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎందరో యువకుల మనసులు విరిగిపోయాయి. అయితే కత్రినా మాత్రం పెళ్లైన తనదైన స్వాగ్‌ను కంటిన్యూ చేస్తోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అయితే తాజాగా కత్రినా, విక్కీకి హాలిడే వచ్చింది. దాన్ని వారిద్దరు నెవ్వర్ బిఫోర్ అనేలా గడపాలనుకున్నారు.

అంతే అందరిలా మల్దీవులకు వెళ్లకుండా దూరంగా ఓ రిమోట్ ఐలాండ్‌కు వెళ్లారు. అక్కడే వీరిద్దరు తమ హాలిడేను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అక్కడ దిగిన ఫొటోలను కత్రినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన కుర్రకారు అమ్మడి అందాలకు ఫిదా అవ్వక తప్పడం లేదు. తెల్లటి ఇసుకలో నల్లటి బికినీ వేసుకుని పాల సముద్రంలో నిలుచున్న దేవతలా కత్రినా కనిపిస్తుంది. దానికి తోడుగా టోపీ, స్మోకింగ్ చేస్తూ అమ్మడి సెక్సీ లుక్స్‌తో అభిమానులను కవ్విస్తోంది. ఈ ఫోటోలకు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. 'నిన్ను చూస్తే దేవతలే సిగ్గుపడతారు. నీ రాకతో సముద్రం కాస్త పాల సముద్రం లా మారింది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story