- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kathi Karthika: కాంగ్రెస్‌లోకి కత్తి కార్తీక.. ముహూర్తం ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: Kathi Karthika to be joined in Congress Party On July 16| టీకాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా కత్తి కార్తీక కాంగ్రెస్ కండువా కప్పుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమక్షంలో జులై16న గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కత్తి కార్తిక పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలో ఆమెకు 363 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కత్తి కార్తిక తొలుత రేడియో జాకీగా పని చేశారు. ఆ తర్వాత ఓ తెలుగు ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు. తెలంగాణ యాసలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె అనంతరం రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దుబ్బాక ఎన్నికల తర్వాత కొంత కాలంగా రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటున్న ఆమె తాజాగా కాంగ్రెస్‌లో చేరేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకోడం ఆసక్తిగా మారుతోంది. అయితే చేరికల విషయంలో అన్ని పార్టీలు సీరియస్‌గా పని చేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్‌లో జోష్ పెంచుతోంది. టీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ఇటీవల బడా నేతలను పార్టీలో చేర్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించగలిగిన రేవంత్ రెడ్డి టీమ్.. తాజాగా కత్తి కార్తికకు సైతం కాంగ్రెస్ కండువా కప్పేందుకు సిద్ధం అయ్యారు.
ఇది కూడా చదవండి: రిపోర్టర్ జమీర్ మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
- Tags
- Kathi Karthika