NBK : వంటలక్కకు బాలయ్య బిగ్ ఆఫర్.. ఆ సినిమాలో సూపర్ ఛాన్స్

by samatah |   ( Updated:2022-04-15 06:23:34.0  )
NBK : వంటలక్కకు బాలయ్య బిగ్ ఆఫర్.. ఆ సినిమాలో సూపర్ ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : మాటీవీలో కార్తీక దీపం సీరియల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అప్పట్లో దీన్ని బుల్లితెర బహుబలిగా పోల్చారు. ఇక ఈ సీరియల్ టీర్పీ రేటింగ్ సృష్టించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించిన సీరియల్‌గా రికార్డు సృష్టించింది. సినిమాలో నటించిన నటీనటులందరూ మంచి పేరు తెచ్చుకున్నారు.

డాక్టర్ బాబు భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన దీప ఫ్యామిలీ ఆడియన్స్‌నే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా అలరించింది. సోషల్ మీడియాలో ఆమెపై చాలా మీమ్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇటీవల సీరియల్‌లో వారి క్యారెక్టర్స్ క్లోస్ అయ్యాయి. దీపతోపాటు డాక్టర్ బాబ్ చనిపోవడంతో.. సీరియల్‌లో వారి క్యారెక్టర్స్ లేకుండా అయిపోయాయి. దీంతో రేటింగ్ కూడా పడిపోయింది. ఇక దీప క్యారెక్టర్ లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ సినిమాల్లో నటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బుల్లితెర హీరోయిన్‌కు గతంలో అనేక ఆఫర్లు తలపుతట్టాయి. కానీ, సీరియల్ షూటింగ్‌కు ప్రాబ్లం అవుతుందని ఒప్పుకోలేదంట. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో వంటలక్క ఆలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఓ ముఖ్యపాత్రలోనటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story