OTT లోకి రాబోతున్న కార్తీ కొత్త సినిమా

by Prasanna |
OTT లోకి రాబోతున్న కార్తీ కొత్త సినిమా
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy) కాంబోలో తెరకెక్కిన సినిమా ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram). ఈ మూవీలో టీజర్, ట్రైలర్స్ అందర్ని ఆకట్టుకున్నాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి హిట్ సినిమాలకు డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ మూవీ విడుదల అయింది. తెలుగులో ఈ మూవీని ‘ఏషియన్ సురేష్’ సంస్థ రిలీజ్ చేసింది.

ఈ మూవీకి రూ.6.27 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. 9 రోజుల్లో ఈ మూవీ రూ.4.04 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మూవీ రిలీజ్ అయి నెల కూడా కాలేదు అప్పుడే ‘సత్యం సుందరం’ మూవీ OTTలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మనకి అందుబాటులో ఉండనుంది. ఇక, ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed