- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అభివృద్ధి బాగుంది.. కర్ణాటక వ్యవసాయ మంత్రి ప్రశంస
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్శివారు రాజేంద్ర నగర్‌లోని నేషనల్ఇనిస్టిట్యూట్ఆఫ్అగ్రికల్చర్ఎక్స్టెన్షన్మేనేజ్మెంట్లో 'మేనేజ్' అగ్రి ఫిలిం ఫెస్టివల్-2022ను శనివారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 11 భాషల్లో వ్యవసాయ అంశాలకు సంబంధించి 270కి పైగా షార్ట్‌ఫిలిం ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. అందులో ఉత్తమమైన షార్ట్‌ఫిలింలను ఎంపిక చేసి కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. తెలుగులో కాషాయాలు ద్రవణాలు అనే షార్ట్ఫిలింకు జ్యూరీ ఫస్ట్ప్రైజ్రాగా, తెలంగాణలోని డ్రిప్ఇరిగేషన్పై రూపొందించిన మరో షార్ట్ఫిలింకు జ్యూరీ థర్డ్ప్రైజ్వచ్చింది. బెస్ట్షార్ట్ఫిలింగా ఇంగ్లిష్‌భాషలో రూపొందించిన స్మార్ట్ ఖేతీ అప్నా ఖుషీయా ఎంపికైంది.
ఈ సందర్భంగా కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్మాట్లాడుతూ.. దేశంలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలనే ప్రధాని మోడీ కల త్వరలో నెరవేరబోతోందని అన్నారు. తెలంగాణ విత్తనరంగ అభివృద్ధి బాగుందని ఆయన కొనియాడారు. అనంతంరం వ్యవసాయ, విత్తనరంగ అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక వ్యవసాయశాఖ బృందం రాజేంద్రనగర్‌లో విత్తన పరీక్షల ల్యాబ్‌ను, ఆచార్య జయశంకర్ వర్సిటీలోని అగ్రిహబ్‌ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర, కర్ణాటక వ్యవసాయ కమిషనర్ నందిని కుమారి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఎండీ కేశవులు, టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ రాములు పాల్గొన్నారు.