సినిమాలకు పనికిరానని ఎగతాళి చేశారు.. కంగనా

by Manoj |   ( Updated:2022-03-06 19:19:19.0  )
సినిమాలకు పనికిరానని ఎగతాళి చేశారు.. కంగనా
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిర్మాత ఏక్తా కపూర్‌పై ప్రశంసలు కురిపించింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ 'లాక్ అప్' షోకు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఏక్తాకపూర్ నిజాయితీ, మంచి మనస్తత్వం గల గొప్ప వ్యక్తి అంటూ కంగనా పొగిడేసింది. 'సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరితో పరిచయం లేదు. నన్ను ఒంటరి చేసి ఏడిపించేవారు.

ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని దారుణంగా అవమానించారు. మరికొందరైతే ఇండస్ట్రీ‌ నీ లాంటి వారి కోసం కాదు. ఇక్కడ నువ్వు సరిపోవు. ముళ్లే మూట సర్దుకుని ఇంటికి వెళ్లిపోమంటూ నా ముఖంపైనే చెప్పారు. కానీ, నిర్మాత ఏక్తా కపూర్ అందరిలా కాకుండా భిన్నంగా కనిపించింది. కెరీర్​మొదట్లో ఆమెతో కలిసి పనిచేస్తుంటే తన వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె పట్ల నాకు గౌరవం, ప్రేమ పెరిగింది. అంతేకాదు నాకు మొదటి విజయం అందించిన ఆమె.. ఇప్పటికీ సమస్యలు ఎదురైనప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు' అంటూ వివరించింది.

Advertisement

Next Story