- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్ ప్రముఖులను ఎగతాళి చేసిన కంగనా.. చీప్ పబ్లిసిటీ అంటూ
దిశ, సినిమా: కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ ప్రముఖులను ఎగతాళి చేస్తూ మాట్లాడింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా విజయంపై ప్రశంసలు కురిపించిన ఆమె పరిశ్రమలో ఉన్న అతిపెద్ద పేర్లు ఈ చిత్ర విజయంపై మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ ఘాటుగా విమర్శించింది. ఈ మేరకు సినిమాకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు చెప్పిన కంగనా అతి ముఖ్యమైన సినిమాల్లో 'ది కశ్మీర్ ఫైల్స్' ఒకటిగా పేర్కొంది.
అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఆమె.. ఈ మూవీ కేవలం కంటెంట్ పరంగానే కాకుండా భారీ వసూళ్లు రాబట్టి ఎన్నో చిన్న సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చింది. అంతేకాదు భారీ బడ్జెట్ లేదా విజువల్/విఎఫ్‌ఎక్స్‌తో కూడిన సినిమాలు చూడటానికి కళ్లద్దాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల అపోహలను, ఆలోచనలను ఈ చిత్రం బద్దలు కొట్టి థియేటర్లకు తీసుకువస్తోందన్న ఆమె.. ఉదయం 6గంటలకే మల్లీప్లెక్స్‌లు నిండిపోయాయని, ఇది నమ్మశక్యంగా లేదని తెలిపింది. ఇక చివరగా సినిమాను ఉద్ధేశిస్తూ.. 'చీప్ పబ్లిసిటీ లేదు. ఫేక్ నంబర్లు లేవు. మాఫియా లేదు. దేశ వ్యతిరేక ఎజెండా లేదు. సినిమాతో దేశం మారిపోతుంది. జై హింద్' అంటూ ట్వీట్ చేసింది.