- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamal Haasan: కీలక నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్.. ఇకపై అలా పిలవొద్దంటూ ఎమోషనల్ నోట్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan) ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టిక్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా,కమల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ ‘X’ ద్వారా ఎమోషనల్ నోట్(emotional note) షేర్ చేశారు. అంతేకాకుండా తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ‘‘నా వర్క్ ని మెచ్చి ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులను అందించినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు నా మనసుని తాకాయి. నన్నెంతగానో కదిలించాయి. కానీ ఏ ఒక్క వ్యక్తి ఊహకు అందనిదే సినిమా అందులో నేను ఓ నిత్య విద్యార్థిని(student).
ఆ రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని.. మరింత ఎదగాలని ఆశిస్తున్నా.కళల మాదిరిగా సినిమా అందరికీ చెందినది. కాబట్టి కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సహాకారం, విభిన్నమైన గొప్ప కథలకు ప్రతిబింబమే సినిమా. కళాకారుడు కళ కంటే గొప్పవాడు కాదని నేను నమ్ముతాను. ఎప్పటికీ స్థిరంగా ఉండాలని నా లోపాలు గుర్తించి మెరుగుపరుచుకుంటూ నటుడిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నాను. దయచేసి స్టార్ ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తా.
నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు, తోటి భారతీయులంతా నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కె.హెచ్ అని పిలవాలని అభ్యర్థిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలని నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ కమల్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.