18 ఏళ్ల అమ్మాయిలు అలా చేయడంలో తప్పులేదు.. కాజోల్

by sudharani |
18 ఏళ్ల అమ్మాయిలు అలా చేయడంలో తప్పులేదు.. కాజోల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ నైసా దేవ్‌గన్ అరంగేట్రంపై తల్లి కాజోల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటిని మీ అడుగుజాడల్లోనే నడుస్తున్న నైసా పరిశ్రమలోకి ఎప్పుడు రాబోతున్నారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పందించిన కాజోల్.. 'మా పిల్లలు ఏమి చేయాలనుకున్నా పూర్తిగా మద్దతిస్తున్నాం. మేము ఉన్నంత కాలం సంతోషంగా వారి కలలు నెరవేర్చుకోవాలని సూచించాం. అయితే తల్లిదండ్రులుగా చిత్ర పరిశ్రమలోకి నడిపించడమే మా బాధ్యత కాదు. ఎక్కడ సంతోషంగా ఉండగలరో అటువైపుగా నడిపించడమే మా పని. ఇప్పుడు నా కూతురు 18 ఏళ్లు దాటింది కాబట్టి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలదనే భావిస్తున్నాం' అని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన నైసా దేవ్‌గన్ ఎప్పటికప్పుడు నయా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

Advertisement

Next Story