- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు!
దిశ, పటాన్‌చెరు: రాహుల్ గాంధీపై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె. నరసింహా రెడ్డి ఆదివారం పట్టణంలోని జాతీయ రహదారిపై అస్సాం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై చేసినటువంటి వ్యాఖ్యలను అస్సాం సీఎం ఉపసంహరించుకోవాలని, అతను పదవిలో కొనసాగించడానికి అర్హత లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, సామాన్యుడు నిత్యావసరాలు కొనే పరిస్థితులు లేవని తెలిపారు.
జీఎస్టీ నోట్ల రద్దుతో లక్షలాది ఉద్యోగాలు పోయాయని, చిన్నతరహా పరిశ్రమలు లక్షలాదిగా మూతపడ్డాయని విమర్శించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. దేశంలో బీజేపీ మతకల్లోలాలు సృష్టించి మతాలపైన, కులాల పైన దాడులకు దిగుతూ దేశంలో అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నాయకులు యువరాజ్, రతన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.