Jyotiraditya Scindia: జ్యోతిరాధిత్య సింథియాకు ఉక్కు శాఖ

by S Gopi |   ( Updated:2022-07-07 13:43:23.0  )
Jyotiraditya Scindia Gets Additional Charges of Steel Ministry
X

న్యూఢిల్లీ: Jyotiraditya Scindia Gets Additional Charges of Steel Ministry| కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉక్కు శాఖ మంత్రిగా మోడీ ప్రభుత్వం నూతన బాధ్యతలను కట్టబెట్టింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం వెల్లడించారు. 'ప్రధాని మోడీ ఆదేశాల మేరకు నేను ఉక్కు శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నాను. శ్రేయోభిలాషులందరి ఆశీస్సులతో ఈ కొత్త బాధ్యతలను నిర్వర్తించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కేంద్రం దిశానిర్ధేశంలో దేశ ఆకాంక్షలను నేరవేర్చేందుకు పనిచేస్తాను' అని ట్వీట్ చేశారు. ఉద్యోగ్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించేముందు సింథియా గణేషుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఉక్కు కార్యదర్శి సంజయ్ కుమార్ ఇతర అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బుధవారమే రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడానికి రోజు ముందే రామ్ చంద్ర‌ప్రసాద్ సింగ్ ఉక్కు శాఖ మంత్రిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story