Yadadri: ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టుల ఆందోళన.. అరెస్ట్‌లు చేయించిన ఆలయ ఈవో

by Javid Pasha |   ( Updated:2022-04-05 05:40:05.0  )
Yadadri: ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టుల ఆందోళన.. అరెస్ట్‌లు చేయించిన ఆలయ ఈవో
X

దిశ, యాదాద్రి: యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు విధించారు. వాటిని ఎత్తేయాలంటూ జర్నలిస్టులు ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారిపై యాదాద్రి ఆలయ ఈవో తన అధికార బలం చూపారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల అరెస్టులపై పీఎస్ ఎదుట మీడియా వారు నిరసన తెలిపారు. వీరి నిరసనకు అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా టీఎర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలు నిరసనలో పాలుపంచుకున్నారు.

Advertisement

Next Story