Prabhas మూవీపై బాలీవుడ్ హీరో క్లారిటీ.. నో ఛాన్స్ అంటూ..

by Javid Pasha |   ( Updated:2022-03-29 17:13:55.0  )
Prabhas మూవీపై బాలీవుడ్ హీరో క్లారిటీ.. నో ఛాన్స్ అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. 'బాహుబలి'తో మొదలైన ప్రభాస్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ మూవీ అంటేనే సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ 'సలార్'పై అనేక వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా వీటిపై జాన్ స్పందించాడు. తాను ప్రాంతీయ సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో చేయనని తేల్చి చెప్పాడు. తాను హిందీ సినిమా హీరోనని, ప్రాంతీయ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే లేదని అన్నాడు. దాంతో పాటుగా తాను ప్రభాస్ నటిస్తున్న 'సలార్'లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా కేవలం ఆయా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి సెండ్ లీడ్ పాత్ర చేయనని, హీరోగా హిందీ సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు.



Advertisement

Next Story