షర్మిల దీక్ష ఫలితమే నిరుద్యోగ నోటిఫికేషన్.. కేసీఆర్ మాట నిలుపుకోవాలి: వైఎస్ఆర్‌టీపీ

by Javid Pasha |
షర్మిల దీక్ష ఫలితమే నిరుద్యోగ నోటిఫికేషన్.. కేసీఆర్ మాట నిలుపుకోవాలి: వైఎస్ఆర్‌టీపీ
X

దిశ, కామారెడ్డి రూరల్ : వైఎస్ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షల ఫలితమే నిరుద్యోగ నోటిఫికేషన్ అని వైఎస్ఆర్‌టీపీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ నీలం రమేష్ తెలిపారు. ఆయన సెల్ఫీ వీడియో ద్వారా బుధవారం ఈ సందేశాన్ని పంపించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం షర్మిల దీక్ష ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ప్రకటించడంతోనే చేతులు దులుపుకోవద్దని, ఉద్యోగాలు కల్పించి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఉద్యోగాలు తొందరగా భర్తీ చేసి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.


Advertisement

Next Story