- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రుడు, అంగారకుడికి బుల్లెట్ ట్రైన్.. ప్లానింగ్‌లో జపాన్
దిశ, ఫీచర్స్ : సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే అద్భుతాలను టెక్నాలజీ సాయంతో రియాలిటీగా మార్చేందుకు జపాన్ ప్రయత్నిస్తోంది. సమీప భవిష్యత్తులో మనుషులు రైలులో వివిధ గ్రహాల మీదుగా ప్రయాణించే కలను సాకారం చేసే దిశగా అడుగులేస్తోంది. అవును, మీరు చదివింది నిజమే! అంగారకుడు, చంద్రునిపైకి మానవులను పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది జపాన్. ఇందుకోసం స్పేస్‌లో భూమి గురుత్వాకర్షణ, వాతావరణం, టోపోగ్రఫీ(స్థలాకృతి) సృష్టిస్తూ ఇంటిని తలపించే గ్లాస్ హ్యాబిటేట్ స్ట్రక్చర్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
భూమి నుంచి చంద్రుడు, అంగారకుడిని లింక్ చేసే క్యాప్యూల్:
కజిమా కన్‌స్ట్రక్షన్‌తో కలిసి జపాన్ క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అనుభూతిని కలిగించే ప్రణాళికపై పనిచేస్తున్నారని వెదర్ చానల్ నివేదించింది. వారి ఇంటర్‌ప్లానెటరీ ట్రాన్స్‌పోర్టేషన్(అంతర్ గ్రహ రవాణా వ్యవస్థ)ను 'హెక్సాట్రాక్' అంటారు. ఇది సుదూర ప్రయాణంలో తక్కువ గురుత్వాకర్షణకు సంబంధించి ఎక్కువ ఎక్స్‌పోజర్ ప్రభావాలను తగ్గించడానికి 1G గురుత్వాకర్షణను మెయింటైన్ చేస్తుంది. ఈ ట్రైన్స్‌లో హెక్సాగోనల్ (షట్కోణ) ఆకారంలో ఉండే 'హెక్సాక్యాప్సూల్స్' ఉంటాయి. వీటి మధ్యన కదిలే పరికరం కూడా ఉంటుంది. పరిశోధకుల ప్రతిపాదన ప్రకారం 15 మీటర్ల వ్యాసార్థం కలిగిన మినీ క్యాప్సూల్ భూమి, చంద్రుడిని కలుపుతుంది. చంద్రుడు, అంగారక గ్రహాన్ని కనెక్ట్ చేయడానికి 30 మీటర్ల వ్యాసార్థం గల క్యాప్సూల్ అవసరం. కాగా ఈ క్యాప్సూల్ జర్మనీ, చైనాలోని మాగ్లెవ్ రైళ్లలో ఉపయోగించే విద్యుదయస్కాంత సాంకేతికతను ఉపయోగిస్తుంది.
చంద్రునిపై నుండే స్టేషన్.. గేట్‌వే శాటిలైట్‌ను ఉపయోగిస్తుంది. దీనినే లూనార్ స్టేషన్‌గా, అంగారక గ్రహంపై ఉన్న రైలు స్టేషన్‌ను మార్స్ స్టేషన్‌గా పిలుస్తారు. హ్యూమన్ స్పేసియాలజీ సెంటర్ ప్రకారం.. ఎర్త్ స్టేషన్‌ను టెర్రా స్టేషన్ అని పిలుస్తారు. ఇక స్పేస్ ఎక్స్‌ప్రెస్‌గా పిలువబడే స్పేస్ రైలు, స్టాండర్డ్ గేజ్ ట్రాక్‌లో నడుస్తుందని Mashable ఇండియా నివేదించింది. ఈ బుల్లెట్ రైలు వాస్తవరూపం దాల్చేందుకు ఒక శతాబ్దం పట్టే అవకాశం ఉండగా.. 2050 నాటికి సరళీకృత ప్రోటోటైప్ వెర్షన్ రూపొందించాలని పరిశోధకులు యోచిస్తున్నారు.