- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌కు జాన్వీ కపూర్ రివ్యూ.. సమంత రియాక్షన్ ఏంటంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్ జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). దీనికి ‘ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి ప్రేక్షకుల్లో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా సమంత అభిమానులను ఫిదా చేసింది. ఈ క్రమంలో.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ భారీ అంచనాల నడుమ మధ్య విడుదలై ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. నవంబర్ 7 నుంచి అమెజాన్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌గా నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది.
ప్రజెంట్ 200 దేశాల్లో ప్రసారమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ చూసిన సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor) ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా సిటాడెల్ తుఫాను ఏర్పడేలా చేసింది. దీనికి వస్తోన్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన సమంత(Samantha) తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ థాంక్స్ చెప్పింది.